తాజా వార్తలు

Friday, 28 August 2015

చంద్రబాబు జీవితమంతా మచ్చలే- రోజా


సీఎం చంద్రబాబు నాయుడు జీవితమంతా మచ్చలే అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తన జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకుంటున్నారని మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటుపొడవడం మచ్చకాదా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు జీవితంలో చెప్పుకోలేని మచ్చలున్నాయని ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చీకట్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, అదే కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకుని సమైక్యాంధ్ర ఉద్యమానికి వెన్నుపోటుపొడిచిన మచ్చ చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేక హోదాను పణంగా పెట్టింది చంద్రబాబు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మహిళలను కించపరుస్తు సామెతలు చెప్పడం దారుణం అన్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment