తాజా వార్తలు

Monday, 31 August 2015

సల్లేఖన వ్రతానికి సుప్రీం అనుమతి

సల్లేఖన వ్రతం ఆచరణకు సుప్రీంకోర్టు అనుమతించింది. చనిపోయేదాక అన్న పానీయాలు మానేసే సల్లేఖన వ్రతాన్ని నేరంగా పరిగణిస్తూ ఇటీవల రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కోర్టు స్టే విధించింది. కాగా సల్లేఖన వ్రతం నేరమంటూ ఇటీవల రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పడంతో జైనులు ఆందోళనకు దిగారు. జైనుల సంప్రదాయ ఉపవాస దీక్ష అయిన సల్లేఖన వ్రతం ఆత్మహత్య కిందకు రాదని, మత సంప్రదాయమని బ్యానర్లు ప్రదర్శించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు సల్లేఖన వ్రతం  ఆచరణకు అనుమతించడంతో జైనులు హర్షం వ్యక్తంచేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment