తాజా వార్తలు

Saturday, 22 August 2015

ఎ.పి లో ఆధికార పక్షానికి ముచ్చెమటలు


విద్యా సమస్యల విషయంలో వైఎస్ ఆర్ పార్టీకి మంచి మైలేజి వస్తోంది. పేద  విద్యార్తులకు   స్కాలర్ షిప్పుల విషయాన్ని  మేనిఫెస్టోలో ప్రకటించినపుడే ..,యువతీ యువకులలో  పాజిటివ్ స్పందన కనిపించింది.  ఆ తర్వాత  ఫీజు  రీ ఎంబర్స్మేంట్ విషయంలో  తొలినాళ్లలో చేపట్టిన దీక్షకు అశేష స్పందన  లభించింది.  ఈ చర్యలు  విద్యార్తులలో  పార్టీపై నమ్మకాన్ని పెంచగా.,  హైజాక్ చేయడంలో పేరున్న  హైటెక్కు ముఖ్య మంత్రి., ఎన్నికలకు ముందు  యువతకు  కల్లబొల్లి కబుర్లు చెప్పేసి ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా  ఇప్పుడు యువతకు  మెండి చెయ్యు చూపాడు. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఇటీవల నడుస్తున్న ఆంశాలే   దీనికి  ప్రత్యక్ష తార్కాణాలు.  ఇంటిలిజెన్న్., పోలీస్., సొంత నెట్ వర్క్ కలిగిన ఎ.పి సర్కార్ కు   ర్యాగింగ్ భూతంతో దిగాలు పడి ప్రాణాలు తీసుకుంటున్న  విద్యార్తుల  ఆర్త నాదాలు పట్టవా…. ఇటీవల జరిగిన వరుస సంఘటనలు  బాబు  నిద్రాణ ఆవస్తను సూచించడంలేదా…..రిషితేశ్వరి కేసు విషయంలో ఏం జరిగింది… నిద్ర మత్తులో జోగుతున్న టిడిపిని తూర్పారబట్టి  నిద్రలేపిన  సింహ గర్జన   వైసిపిదే.. కాదా…. ఒక రకంగా  విద్యార్తులలో చైతన్య స్పూర్తి  రగిల్చింది… వైసిపినే….   ఆ తర్వాత తూతూ   మంత్రం కమిటీలు., విచారణలు   వచ్చాయి. ఇప్పుడు కడపలో  విద్యార్తి  ఆత్మహత్య  సంఘటనను కూడా  వైసిపి., తెరపైకి తెచ్చే సరికి ఎ.పి లో ఆధికార పక్షానికి ముచ్చెమటలు పడుతున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment