తాజా వార్తలు

Wednesday, 26 August 2015

గుడివాడ నియోజకవర్గము మీద తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరిన వైకాపా ...ఈ మధ్య తరచూ పులివెందుల నియోజకవర్గం లో పాగా వేస్తాం.. .అంటూ ప్రకటనలు చేస్తున్నాడు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ. వచ్చే ఎన్నికల్లో జగన్ ను కూడా ఓడిస్తామనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు ఈయన. ఒకసారి కాదు దేవినేని ఉమ తరచూ పులివెందుల గురించే మాట్లాడుతున్నాడు. ఇతర టాపిక్ లేవీ లేనట్టుగా పులివెందుల ను గెలిచేయడం గురించే ఆయన మాట్లాడుతున్నాడు. 
ప్రతిపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గాన్ని కూడా గెలిచేస్తాం... అని చెప్పడం వరకూ బాగానే ఉంది. పులివెందులను గెలిచి ప్రతిష్టాత్మక విజయాన్ని సాధిస్తామని చెప్పడం కూడా అదుర్స్. అయితే తెలుగుదేశం పార్టీ ఆ ప్రతిష్టాత్మక నియోజకవర్గాన్ని గెలవడాని కన్నా ముందు.. మరో ప్రతిష్టాత్మక నియోజకవర్గాన్ని గెలుచుకోవాల్సి ఉంది. అదే గుడివాడ. 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కాబట్టి... అక్కడ విజయం సాధించడం అనేది తెలుగుదేశం పార్టీకి గొప్ప కావొచ్చు. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి.. దాన్ని గెలవడం ఇంకా ప్రతిష్టగా తీసుకోవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ ఇతరుల ప్రతిష్టపై విజయం సాదించడం కన్నా.. తమ ప్రతిష్టను అయినా భవిష్యత్తులో నిలబెట్టుకొంటే మంచిదే. వైఎస్సార్ ప్రాతినిధ్యం వహించడం కన్నా ముందు ఎన్టీఆర్ పురిటి గడ్డ ను గెలుచుకోవాలి. 
వచ్చే ఎన్నికల్లో అయినా.. గుడివాడ నుంచి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించాలి. తెలుగుదేశం నుంచి వైకాపా వైపు వెళ్లిపోయి.. బలంగా వీచిన తెలుగుదేశం గాలిలో కూడా గుడివాడ నుంచి ఆసక్తికరమైన రీతిలో విజయం సాధించాడు వైకాపా అభ్యర్థి కొడాలి నాని. మరి ఆయనను భవిష్యత్తులో ఓడించి గెలిస్తే.. తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట నిలబడినట్టు. తమ సొంత జిల్లాలోని ఆ నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకొంటే దేవినేని ఉమ వంటివాళ్లు ఆ తర్వాత కావాలంటే పులివెందుల గురించి ఆలోచించవచ్చునేమో!
« PREV
NEXT »

No comments

Post a Comment