తాజా వార్తలు

Monday, 31 August 2015

తెలంగాణ గ్రూప్స్ సిలబస్ విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన స్కీంను, సిలబస్ ను విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 1,,2,3,4 తోపాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించిన స్కీం, సిలబస్ ఉన్నాయి. ఇవి తమ వెబ్ సైట్ లో వెంటనే అందుబాటులోకి వచ్చాయని టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు. సహజంగా నోటిఫికేషన్స్ తో పాటే సిలబస్ ప్రకటిస్తామని, అభ్యర్ధుల ఆందోళన నేపథ్యంలో ముందే విడుదల చేస్తున్నామని ఘంటా చక్రపాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామ్, రామయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ర్టంలోని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సిలబస్ రూపొందించాలని నిర్ణయించామని చక్రపాణి తెలిపారు. ఇందుకోసం 32 మంది తెలంగాణ మేధావులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కమిటీ నెల రోజుల పాటు శ్రమించి సిలబస్ తయారు చేశారని, దానిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపామన్నారు. ఈ స్కీంను, సిలబస్ ను రాష్ర్ట ప్రభుత్వం జులై 27న ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. స్కీంను 90 మంది అనుభవజ్ఞులైన అధ్యాపకులు విశ్లేషించి పూర్తిస్థాయి సిలబస్ తయారు చేశారని చెప్పారు. తెలంగాణ చరిత్రను సిలబస్ లో పొందుపరిచామని చక్రపాణి తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment