తాజా వార్తలు

Saturday, 22 August 2015

చీప్ లిక్కర్ పాలసీ వ్యతిరేక ఉద్యమంపై పోరాడుతాం-ఉత్తమ్ కుమార్ రెడ్డి


హైదరాబాద్ కళింగభవన్ లో చీప్ లిక్కర్ పాలసీపై జరిగిన సమావేశానికి ఉత్తమ్‌, ఎర్రబెల్లి, కె.లక్ష్మణ్‌, పొన్నం, రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా చీప్‌ లిక్కర్‌ వ్యతిరేక ఉద్యమ స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ఎన్నికయ్యారు. చీప్ లిక్కర్ పాలసీతో సీఎం కేసీఆర్‌ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. లిక్కర్‌ పాలసీపై అఖిలపక్షం అభిప్రాయాన్ని తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాహితం కోసం ఎలాంటి పోరాటానికైనా కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని ఉత్తమ్‌కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు..గజ్వేల్‌ నుంచి చీప్‌ లిక్కర్‌ వ్యతిరేక ఉద్యమం ప్రారంభిస్తామని టీటీడీపీ నేత ఎర్రబెల్లి తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment