తాజా వార్తలు

Saturday, 22 August 2015

బరువు తగ్గడానికి చిట్కా


బరువు తగ్గాలన్నా..శరీరానికి కావల్సిన పిండిపదార్థాలు సమపాలల్లో అందించాలంటే మొలకెత్తే విత్తనాలే భేష్  అంటున్నారు పరిశీలకులు. మొలకెత్తే గింజల్లో.. సమృద్ధిగా అత్యవసర పోషకాలు ఉంటాయి. మొలకలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ కె ఉన్నాయి. దీనితో బాటుగా ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. మొలకెత్తిన తర్వాత గింజలు చాలావరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది.  మొలకలలో మన శరీరానికి ఉపయోగమైన, ఆరోగ్యకర౦గా ఉంచే ఎంజైములు సమృద్ధిగా ఉన్నాయి. ఆహారాన్ని వండినప్పుడు వీటిలో కొన్ని ఎంజైములను నష్టపోతాము. అందువల్ల తాజా మొలకలను తిని శక్తివంతమైన ఎంజైములను పొందాలి. మొలకలలో మాంసకృతులు అత్యంత ఎక్కువ స్థాయిలో ఉంటాయి. వీటిలో 35 శాతంవరకు మాంసకృతులు ఉంటాయి. మీ ఆహారానికి మొలకలు జోడించడం వలన మీ శరీరానికి అవసరమైన మాంసకృతులను అందించడమే కాక జంతువుల మాంసాల వలన వచ్చే కొవ్వును, కోలెస్టరాల్ను, క్యాలరీలను తగ్గిస్తుంది. ఎక్కువగా శాకాహారం ఇష్టపడే వారికి, శాకాహారులకు మొలకలు ఎంతగానో సిఫార్సు చేయబడ్డాయి. మొలకలలో మీరు ఇష్టపడే మరొక విషయం అవి ఎంతో తేలికగా జీర్ణమౌతాయి. మొలకలను తినడం జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇవి పిల్లలకు, పెద్దలకు కూడా ఉత్తమమైనవి.

« PREV
NEXT »

No comments

Post a Comment