తాజా వార్తలు

Wednesday, 23 September 2015

హ్యాట్రిక్ 100కోట్ల హిరోయిన్

ఒకే ఏడాది వంద కోట్ల క్లబ్‌లో చేరిన హ్యాట్రిక్ హిట్ చిత్రాల కథానాయికగా శృతిహాసన్ పేరు తెచ్చుకోని రికార్డు సృష్టింది.  బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం గబ్బర్ ఈజ్ బ్యాక్. తమిళ చిత్రం రమణ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. జాన్ అబ్రహం, అనిల్‌కపూర్, నానా పటేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వెల్‌కమ్ బ్యాక్. వెల్‌కమ్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా ఇటీవలే విడుదలై వంద కోట్లు వసూలు చేసింది. తాజాగా తెలుగులో మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడు చిత్రం కూడా పై చిత్రాల తరహాలోనే వంద కోట్లు వసూలు చేసి బాహుబలి తరువాత దక్షిణాదిలో వంద కోట్లు సాధించిన ద్వితీయ చిత్రంగా నిలిచింది. ఈ మూడు చిత్రాల్లో శృతిహాసన్ కథానాయికగా నటించింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment