తాజా వార్తలు

Saturday, 5 September 2015

ఆస్ట్రియాలో అఖిల్, సయేషా రోమాన్స్

అఖిల్ సినిమా పాటల షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన 3 పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 1 నుంచి ఆస్ట్రియాలో హీరో అఖిల్, హీరోయిన్ సయేషాలపై ఓ పాట చిత్రీకరమ జరుగుతోంది. దీని తర్వాత స్పెయిన్ లో మరో పాట షూట్ చేస్తాం. సెప్టెంబర్ 13 వరకు ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మరో పాట తీస్తాం. దీంతో టోటల్ గా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. సెప్టెంబర్ 20న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ ఆడియోను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. అలాగే విజయదశమి కానుకగా అక్టోబర్ 22న సినిమాను రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. అక్కినేని, వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం అఖిల్. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిఖితా రెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ ఆస్ట్రియాలో జరుగుతోంది. అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతో పాటు లండన్ కు చెందిన వారు నటిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment