తాజా వార్తలు

Wednesday, 9 September 2015

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ‌ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటూ..గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రాయలసీమలో కూడా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. రానున్న 72 గంటల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వానలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. 
« PREV
NEXT »

No comments

Post a Comment