తాజా వార్తలు

Sunday, 13 September 2015

ఏపీలో ఇద్దరు సైబర్ కేటుగాళ్ల అరెస్ట్

లాటరీల పేరుతో జనాలను బురిడి కొట్టిస్తున్న ఇద్దరు సైబర్‌ కేటుగాళ్లను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన ప్రదీప్‌ చక్రవర్తి విశాఖలో ఎమ్మెస్సీ చదువుతున్న ఇంద్రజ అనే యువతికి ఫోన్‌ చేసి ఆమెకు లాటరీ తగిలిందని చెప్పాడు. అది నిజమని నమ్మిన ఇంద్రజ చక్రవర్తి చెప్పిన ఖాతాల్లో 3 లక్షల 21 వేలు డిపాజిట్‌ చేసింది. ఇదే తరహాలో కోల్‌కతాకే చెందిన ఉదయ్‌ కుమార్‌ గుప్తా, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో పని చేస్తున్న సంతోష్‌ కుమార్‌ నుంచి 12 లక్షలు గుంజాడు. ఇంద్రజ, సంతోష్‌కుమార్‌ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు సైబర్‌ మోసగాళ్లను అరెస్ట్ చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment