తాజా వార్తలు

Wednesday, 9 September 2015

సిరియా శరణార్ధులకు ఆస్ట్రేలియా ఆపన్నహస్తం

సిరియా శరణార్ధులకు ఆస్ట్రేలియా ఆపన్నహస్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. సిరియా నుంచి 12 వేల మంది వలసదారులను తమ దేశంలోకి అనుమతిస్తామని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టోనీ అబాట్ మీడియా సమావేశంలో చెప్పారు. వారంతా తమ దేశంలో శాశ్యతంగా ఉండిపోవచ్చని ఆయన పేర్కొన్నారు. వలసదారుల్ని తమ దేశంలోకి అనుమతిచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 13,750 మందిని తమ దేశంలోకి అనుమతిస్తున్నామని, అందులో సిరియాకు చెందిన వారే 12 వేల మంది ఉంటారని ఆయన స్పష్టం చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment