తాజా వార్తలు

Friday, 4 September 2015

స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్ గా మంచు లక్ష్మీ


ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు  స్వచ్ఛభారత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి భారీగా స్పందన లభించింది. స్వచ్ఛభారత్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మిని కేంద్రం ఎంపిక చేసింది.  ఈ నెల 10న ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తేనీటి విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొనాలని మంచు లక్ష్మికి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునందుకొని ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేశాను. తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం మరింత బాధ్యతను పెంచింది. ఇంతటి గౌరవాన్ని అందించిన ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు మంచు లక్ష్మి. 
« PREV
NEXT »

No comments

Post a Comment