తాజా వార్తలు

Monday, 7 September 2015

దిగ్విజయ్ సింగ్ కు మళ్లీ పెళ్లి

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మళ్లీ పెళ్లి కొడుకయ్యారు. 68ఏళ్ల డిగ్గీ రాజ మళ్లీ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం గత నెలలో జరిగింది. రాజ్యసభ టీవీ యాంకర్ అమృతారాయ్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య సహజీవనం విషయం గత ఏడాది ఏప్రిల్‌‌లో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 44 సంవత్సరాల రాయ్‌కు గతంలోనే వివాహం జరిగింది. విడాకుల తర్వాత ఆమె దిగ్విజయ్‌ను వివాహం చేసుకుంటానని గతంలోనే ప్రకటించారు. అలాగే వివాహం చేసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ భార్య 2013లో సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు. 68 ఏళ్ల దిగ్విజయ్ సింగ్‌కు నలుగురు కుమార్తెలు ఒక కుమారుడున్నారు. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ అమెరికాలో ఉన్నారు. అమృతారాయ్ కూడా లీవ్‌లో ఉన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment