తాజా వార్తలు

Tuesday, 1 September 2015

ఇలా చేస్తే నడుము నొప్పి రాదు

సాదారణంగా ఆఫీసుల్లో పనిచేసే వాళ్లు ఎక్కువగా చెప్పే సమస్యల్లో నడుం నొప్పి మొదటి స్థానంలో ఉంటుంది. నడుమునొప్పి..సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– నడుము నొప్పి నివారణకు ప్రతిరోజు వ్యాయామం, యోగా, డాక్టర్‌ సలహ మేరకు చేయాలి.
– ముఖ్యంగా స్పాంజి ఉన్న కుర్చీల్లో కూర్చున్నప్పుడు సరైన భంగిమల్లోనే కూర్చోవాలి.
– వాహనాలు నడిపేటప్పుడు సరైన స్థితిలో కూర్చోవాలి.
– సమస్య ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, ఒకేసారి హటాత్తుగా వంగటం చేయకూడదు.
– నొప్పిగా ఉన్న నడుము భాగం మీద వేడినీటి కాపడం, ఐస్‌ బ్యాగ్‌ పెట్టడం, అవసరమైతే ఫిజియోథెరపిస్టుల వద్ద అల్ట్రాసౌండ్‌ చికిత్స వంటివి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
– శారీరక బరువు ఎక్కువున్నా వెన్నెముక మీద అదనపు ఒత్తిడి, భారం పడుతుంది. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
– శారీరక శ్రమ, వ్యాయామం అలవాటు లేనివాళ్లు బరువులు ఎత్తితే కూడా నడుము నొప్పి వస్తుంది. ఇలాంటి వాళ్లు హఠాత్తుగా బరువులు ఎత్తితే కండరాలు, ఎముకలను పట్టిఉంచే కండరాలు అందుకు తగినట్టుగా స్పందించవు. ఇలాంటి వాళ్లు కాస్త పెద్ద బరువులు ఎత్తకపోవటమే మేలు. ఎత్తేటప్పుడు కూడా నడుము మీద భారం పడకుండా.. మోకాళ్ల మీదే ఎక్కువ భారం పడేలా కూర్చుని లేవాలి, వంగి లేవకూడదు.
– స్కూలు బ్యాగుల బరువు పిల్లాడి బరువులో 10% మించకూడదు. ఈ బ్యాగులకు పట్టీలు ఉండాలి, బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. 16 ఏళ్ల లోపు పిల్లలు అసలు ఎత్తు మడమల చెప్పులు ధరించకపోవటమే మేలు.
– పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. స్థూల కాయం తగ్గించుకోవాలి.
నడుం నొప్పికి చిన్న చిన్న జాగ్రత్తలు
* కుర్చీలో నిటారుగా కూర్చోండి. భుజాలు ముందుకు వాలినట్లుగా ఉండకుండా వెనక్కి ఉండేలా చూసుకోండి.
* వీపు పై నుంచి కింద వరకు కుర్చీకి ఆనుకుని ఉండేలా చూసుకోండి.
* మోకాళ్ళని సరియైన దిశలో మలుచుకుని ఉంచండి. కాలు పక్కకు వంచి కూర్చోవడం చేయకండి.
* మోకాళ్లని హిప్స్ కంటే కొంచెం ఎత్తులో ఉండేలా పెట్టుకుని కూర్చుంటే మరీ మంచిది.
* ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.
* కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.
* అధిక బరువు ఉంటే వెంటనే తగ్గించుకోండి.
* ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయాల్సి వస్తే బ్యాక్ పెయిన్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

« PREV
NEXT »

No comments

Post a Comment