తాజా వార్తలు

Friday, 4 September 2015

భలేభలే మగాడివోయ్ రివ్యూ

మారుతి రాసిన డైలాగులకు ధియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.  మ‌తిమ‌రుపు వ్య‌క్తి ప్రేమిస్తే ఎలాంటి ఫ‌న్ జ‌న‌రేట్ అవుతుందో చూపించే ప్ర‌య‌త్నం చేసాడు మారుతి.
భలేభలే మగాడివోయ్ స్టోరీ-- నాని చిన్నప్పటినుంచీ వీర మతిమరుపు. దాన్నే కంటిన్యూ చేస్తూ పెద్దయ్యాక కూడా మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదుగుతాడు. దాంతో అతనికి పెళ్లి సైతం ఓ సమస్యగా మారుతుంది. ఈ నేపధ్యంలో అతనికి ఓ సైంటిష్టు మురళి శర్మ కుమార్తెతో ఓ సంబంధం చూస్తారు. అయితే నాని..ఆయన్ను తన మతిమరుపుతో ఇబ్బందిపెడతాడు. దాంతో నానికి తన కూతురుని ఎట్టి పరిస్దితుల్లో ఇచ్చేది లేదని తెగేసి చెప్పేస్తాడు. తర్వాత నాని ఓ రోజు లావణ్య త్రిపాఠిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఈ లవ్ జర్నిలో ..తన మతిమరుపుతో కొన్నిసార్లు నాని ఆమె దగ్గర దొరికిపోయే సమయంలో తన సమయస్పూర్తితో అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి బయిటపడుతూంటాడు. అయితే ఇక్కడో ట్విస్ట్...నందిన మరెవరో కాదు తనని ఇష్టపడకుండా రిజెక్టు చేసిన సైంటిస్టు కుమార్తే. ఈ విషయం తెలిసిన నాని ఎలా కవర్ చేసి, ఆమెను దక్కించుకున్నాడు.  
« PREV
NEXT »

No comments

Post a Comment