తాజా వార్తలు

Saturday, 5 September 2015

రెండు యూఎస్ ఫార్మా కంపెనీలను సొంతం చేసుకున్న సిప్లా

ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ సిప్లా అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న రెండు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలను కొనుగోలు చేసింది. ఇన్వాజెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఐఎన్‌సి, ఎక్సెలన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఐఎన్‌సిలను సుమారు రూ.3,630 కోట్ల (550 మిలియన్‌ డాలర్లు)తో స్వాధీనం చేసుకుంది. యుఎస్‌లో రెండు కంపెనీల కొనుగోళ్లతో అక్కడి తయారీ ప్లాంట్‌లోకి ప్రవేశించినట్లయ్యింది. ఈ కంపెనీలు 32 ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. మరో 30 ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి సిద్దంగా ఉన్నాయి. డిసెంబర్‌ 2014 నాటికి ఈ సంస్థల ఉమ్మడి రెవెన్యూ 200 మిలియన్‌ డాలర్లుగా ఉంది. దీంతో అమెరికా ఫార్మాస్యూటికల్‌ మార్కెట్లో తమ విస్తరణకు మరింత దోహదం చేస్తుందని సిప్లా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుభను సక్సేనా అన్నారు. ఈ ఎత్తుగడతో సిప్లా వాటా మరింత పెరుగుతుందన్నారు. ముంబయి కేంద్రంగా పని చేస్తోన్న సిప్లా వర్థమాన దేశాల కంటే తన పోటీదార్ల మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. 
« PREV
NEXT »

No comments

Post a Comment