తాజా వార్తలు

Sunday, 6 September 2015

లవంగాల్లో విలువైన పో షకాలు


రుచి కోసం కూరలలో వేసుకునే లవంగాలలో…వాసనేకాదు.. విలువైన పోషకాలు ఉన్నాయి .
లవంగాల నుంచి నూనె తీయనివి ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎవరైనా కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు మటుమాయమౌతాయి.
 ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగ పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది.
 జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తీసుకోండి. మీ శరీరంలోని జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
లవంగాలు సేవిస్తే ఆకలి బాగా వేస్తుంది. వీటి వలన జీర్ణక్రియకు అవసరమైన రసాలు ఉదరంలో ఊరుతాయంటున్నారు వైద్యులు.
 నిత్యం లవంగాలను తీసుకోవాలనుకునేవారు కేవలం ఐదు లవంగాలను మాత్రమే సేవించాలి. అంతకు మించి వాడితే శరీరం వేడి చేస్తుంది.
 లవంగాలు తెల్ల రక్త కణాలను పెంపొదిస్తుంది. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో ఉన్నాయి.
 ఇది వ్యాధి నిరోధక శక్తిగా కూడా ఉపయోగపడుతుంది. ఎలాంటి చర్మ వ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేసేస్తాయి. దీనిని   చందనంతోపాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులుమటుమాయమంటున్నారు వైద్యులు.
 పది లవంగాలు, గుప్పెడు పుదీనాతీసుకుని మెత్తగా చేయాలి. ఈ మిశ్రమానికి కాస్త శెనగపిండి, చల్లనినీరు కలిపి ముఖానికి ప్యాక్లా వేసి, ఆరాక చల్లని నీటితో కడిగేయాలి. యాంటీ ఆస్ట్రిజెంట్లా పనిచేసే లవంగాలు, మొటిమలను దూరం చేస్తాయి పైగా ఈ ప్యా క్ జిడ్డు చర్మతత్వం గలవారికి చక్కగా పనిచేస్తుంది.
వెడల్పాటి పాత్రలోఒకటిన్నర లీటరు నీళ్లు పోయాలి. అందులో ఏడెనిమిది లవంగాలు, చిటికెడు కర్పూరం, గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసి బాగా మరిగించాలి. చల్లారాక ఈద్రావణాన్ని సీసాలోకి వంపి, ఫ్రిజ్లో భద్రపరచుకోవాలి. అవసరమైనప్పుడు ఈద్రావణాన్ని కొద్దిగా ఒంపుకుని దాంట్లో దూదిని ముంచి ముఖంపై రుద్దుకోవాలి.ఇలా రోజుకు ఐదారుసార్లు చేస్తే చర్మంపై జిడ్డు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా, తాజాగా మారుతుంది.

« PREV
NEXT »

No comments

Post a Comment