తాజా వార్తలు

Tuesday, 1 September 2015

డ్రగ్స్ స్మగ్లర్ మూసా డిశ్చార్జ్

కడుపులో మాదక ద్రవ్యాలతో శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన దక్షిణాఫ్రికా యువతి మూసా ను ఇవాళ ఉస్మానియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు ఆసుపత్రి ఆర్‌ఎంవో నరేందర్‌ తెలిపారు. జోహెనస్‌బర్గ్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌లో ఏమిరేట్స్‌ విమానం నుంచి దిగిన మూసాను అనుమానించిన అధికారులు విచారించగా తాను మాదక ద్రవ్యాలు తీసుకొచ్చినట్లు అంగీకరించింది. మూసా శరీరం నుంచి 51సంచులను డ్రగ్స్‌ బయటకు తీసినట్లు ఆయన తెలిపారు. ఆమెను నార్కోటిక్‌ అధికారులకు అప్పగించనున్నామన్నారు. ప్రస్తుతం మూసా ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్లలో 550 గ్రామాలు కొకైన్ డ్రగ్స్ వేసినట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు రూ.60లక్షల వరకు ఉంటుందని అంచనా.  శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన మూసా తాను గర్భవతిని అని పేర్కొంది. అధికారులకు అనుమానం వచ్చి స్కానింగ్ నిర్వహించారు. కానీ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఎందుకైనా మంచిదని మూసాను అదుపులోకి తీసుకున్నారు. లేడీ డాక్టర్ తో కొన్ని టెస్టులు చేయగా కడుపులో ఏవో ముద్దలు కదులుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. ఉస్మానియా వైద్యులు ఎక్సరే తీయగా మూసా బాడీలో కొన్ని ప్యాకెట్స్ ఉన్నట్టు క్లియర్ గా తెలిసింది. దీంతో కస్టమ్స్ అధికారులు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి సమాచారం అందించారు. ఎన్ సీ బీ అధికారులు తమ దగ్గరున్న అత్యాధునిక స్కానర్లతో పరిశీలించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment