తాజా వార్తలు

Wednesday, 2 September 2015

చంద్రబాబుకు సీఎం స్టేటస్ ఉంటే చాలు

వైఎస్సార్  అసెంబ్లీలో టైగర్..ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా చంద్రబాబుకు సరైన జవాబు చెప్పేదిట్ట..''ఇకచాల్లే..కూర్చోవయ్యా..కూర్చో" అంటూ వైఎస్ హెచ్చరిస్తే..ఇక ఊగిపోవడం బాబు వంతు. అలాంటి సీన్ మళ్లీ సెప్టెంబర్ ఫస్ట్  ఆవిష్కృతమైంది. రాజశేఖరుని తనయుడు జగన్..పేల్చిన ప్రశ్నల బుల్లెట్ల నుంచి టీడీపీ తప్పించుకోలేకపోయింది. అడిగిన ప్రశ్నలకు జవాబులు కాకుండా అనవరసర రాద్ధాంతం అధికారపక్షం వంతు అయింది.
ప్రత్యేకహోదా విషయంలో జగన్ సంధించిన ప్రశ్నల పరంపర అందరినీ ఆలోచింపజేసింది. కేంద్ర కేబినెట్  ఆమోదంలోనే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం, రాష్ట్రం రెండూ లేనిపోనివి చెప్పి డ్రామాలు ఆడుతున్నాయని జగన్..స్పష్టంగా తెలియజెప్పాడు. దీనికి బాబు నుంచి సమాధానం లేదు. జగన్ చూపిన పేపర్లు..ఆ పత్రాలకు చట్టబద్ధత లేదని వితండవాదం చేసిన బాబు..అందులోని వివరాలను మాత్రం ఆలోచించలేదు. కనీసం చెబుతున్న అంశాలను చెవికి ఎక్కించుకోకపోవడం చూస్తే...ఇది బాబు ఆడుతున్న డ్రామా అని అర్థమైపోతుంది. ప్రత్యేకహోదా వస్తే..ఇక స్వేచ్ఛాగా పరిశ్రమలు వచ్చేస్తే..రాష్ట్ర ప్రభుత్వం ఆజమాయిషీ, పెత్తనం అధికార పార్టీ తన అధికార దాహానికి అడ్డుకట్ట పడుతుందనే భయం వారిది.
ప్రశ్నించేది ప్రతిపక్షం...అయితే ప్రస్తుతం అధికారపక్షం వద్ద సమాధానం లేని పరిస్థితి. బహుశా అసెంబ్లీ చరిత్రలో ఇదే మొదటిసారి..ఇంతకూ ప్రత్యేక హోదాకు డెడ్ లైన్ ఉందా..లేదా..అంటే చంద్రబాబు ఉలకడు.. స్పెషల్ స్టేటస్  రాకపోతే తప్పుకుంటారా..అంటే అస్సలు పలకరు. ఏవో కాకమ్మ కబుర్లు చెప్పేసి తీర్మానంలో సరిపెట్టిన బాబు సర్కార్ కు స్పెషల్ స్టేటస్ పై చిత్తశుద్ధి లేదని అసెంబ్లీ సాక్షింగా తేలిపోయింది. చంద్రబాబుకు సీఎం స్టేటస్ ఉంటే చాలు..ఏపికి స్పెషల్ స్టేటస్ లేకున్నా టీడీపీకి చింతలేదని అసెంబ్లీ వేధికగా వెల్లడైంది. జగన్  పాయింట్ పై పాయింట్  చెబుతూ ప్రశ్నిస్తుంటే పరవ్ పాయింట్ ప్రజెంటేషన్  అంటూ హైటెక్కులు ప్రదర్శించే బాబు ఆ పాయింట్లకు ఎందుకు జవాబివ్వలేదు.
రాజధాని నిర్మాణాన్ని విదేశీ సంస్థలకు కట్టబెట్టి కమీషన్లు...విదేశాల్లో ఎస్టేట్లు కొట్టేద్దామను కున్న బాబు టీమ్..ఇప్పట్లో స్పెషల్ స్టేటస్ తీసుకురాదు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ వచ్చేస్తే..అంతా కేంద్రం కనుసన్నల్లో జరగాలి. కాగ్ నిఘా ఉంటుంది. కాబట్టి కొత్త భూసేకరణ చట్టం రాకముందే.. అమరావతిలో భూసేకరణ ముగించేస్తూ రైతల కడుపుకొడుతున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. కొత్త చట్టం వచ్చేస్తే..ఈ బలవంతపు భూ సేకరణ పప్పులు ఉడకవు. అందుకే ఆదరాబాదరాగా బాబు సర్కార్ భూసేకరణ కానిస్తోందని ఓ ఆరోపణ. అలాగే కాంట్రాక్ట్, కమీషన్లు కావాలంటే స్పెషల్ స్టేటస్ కాదు. ప్యాకేజీలు కావాలి. ప్యాకేజీలు వస్తే వాటిని చక్కగా పంచుకోవచ్చు..అదీ బాబు కుట్ర..
ప్రత్యేక హోదా ప్రయోజనాలకు జగన్  అసెంబ్లీలో వివరించినంతగా..ఏనాడు బాబు చేయలేదు. అంతేకాదు. పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని జగన్ చెప్పడం ద్వారా యువనేత యువతపక్షం వహంచారన్న బావన స్పష్టమైంది. మీకు ప్రత్యేకహోదా..తెస్తావా లేదా..అని ప్రశ్నించిన జగన్  తూటాలకు..బాబు నుంచి స్పష్టమైన సమాధానం లేదు. ఏదో చట్టం, నియమాలు, విధానాల గురించి ఏకరువు పెట్టడం మినహా ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు బాబు మరో స్పందనలేదు. సభలో జగన్ ప్రశ్నించినలేరు. అడగలేరు అంతా సామన్యా ప్రజలకు సైతం చక్కగా అర్థమైంది. అడిగిన ప్రశ్నలకు జవాబివ్వలేని టీడీపీ చర్చను..తెలంగాణా సర్కార్  వైపు ఎప్పుడో జరిగిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికల వైపు ఎందుకు మళ్లించిందో అర్థం కాదు. ఎవ్వరూ తమను ఏమీ చేయలేరు అంటూ చంద్రబాబు మరోసారి మోనార్క్ ను తలపించారు. మోడీ ముందు మోకరిల్లిన చంద్రబాబు నైజాన్ని ప్రతిపక్షం అడుగుతున్నా..టీడీపీ మాత్రం దీనిపై మాట్లాడలేదు. అసెంబ్లీకి సమర్పించిన తీర్మాన పాఠం చదువుతున్నప్పుడు కూడా చంద్రబాబు ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని స్పష్టంగా పలకని వైనం టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులకు ఒకింత అనుమానం కలిగించింది. విభజన చట్టంలో ఉన్న అంశాలను నొక్కి వక్కానించి చదవడం కూడా అనుమానానికి బలం చేకూర్చుతుంది.
అనాధగా మిగిలిపోయిన ఆంద్రప్రదేశ్ ను ఆదుకుంటారా..లేరా..?
ఏడాది నుంచి ఊరిస్తున్న ప్రత్యేకహోదా వస్తుందా...రాదా..?
ఒకవేళ ఇచ్చినా...షరతులు, హామీలు నెరవేరుస్తారా..?
కాలయాపనమాని కార్యాచరణకు దిగుతారా..లేదా..?
ఇవీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో ఉన్న అనుమానాలు.
                                                                                               

« PREV
NEXT »

No comments

Post a Comment