తాజా వార్తలు

Friday, 18 September 2015

చేపలు తింటే కీళ్ల నొప్పులు మాయం

కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే వారానికి ఒకసారైనా చేపలు తినండి.  వారానికి ఒకసారైనా చేపలను తినడం వల్ల రుమటాయిడ్‌, ఆర్థ్రరైటిస్‌ వంటి కీళ్లనొప్పుల ముప్పును సగం వరకూ తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం సుమారు 32 వేలమంది స్వీడన్‌ మహిళలపై అధ్యయనం చేపట్టింది. ఈ పరిశోధకుల బృందం తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్న మహిళల ఆహారపు అలవాట్లను గురించి విశ్లేషించింది. చేపలు తిన్న వారికి కీళ్ల నొప్పులు తక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది.

« PREV
NEXT »

No comments

Post a Comment