తాజా వార్తలు

Sunday, 13 September 2015

ఆరోగ్యానికి ఆకుకూరలు

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. తరచుగా దొరికే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం మంచిది. మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవసరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో… శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమీన్లను ప్రోటీన్లను, అందిస్తూ.. నిత్యం తమని ఏదో ఓ రకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసి సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచిరకంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ, ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అవసరమైతే ఆకు కూరలు కడిగేటప్పుడు గట్టిగా వుండే భాగాలను ఏరివేయండి వీలైతే పొటాషియం పర్మాంగనేట్‌తో ఆకుకూరలు శుభ్రం చేస్తే మంచి ఫలితాలుంటాయి. మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర, తోటకూర, తులసి, గోంగూర, బచ్చలి- ఇలా పలు రకాల ఆకుకూరలు వండే ముందు కాస్త ఉప్పువేసి నీటిలో ముంచితే వాటిపై ఉండే క్రిమికీటకాలు, గుడ్లు, నాశనమవుతాయి. ఇవి తొందరగా నలిగే గుణం ఉండడం వల్ల సలాడ్‌ , సూపులుగా , చట్నీలుగా తీసుకోవచ్చు. అన్ని సీజన్లలో దొరికే ఆకు కూరలను మిస్ కాకుండా తప్పకుండా తినండి. ఆరోగ్యాన్ని కాపాడు కోండి.
« PREV
NEXT »

No comments

Post a Comment