తాజా వార్తలు

Tuesday, 29 September 2015

హితుడు ట్రైలర్, పోస్టర్ విడుదల

జగపతిబాబు, మీరా నందన్‌ ప్రధాన పాత్రధారులుగా సుంకర మధుమురళి సమర్పణలో కెఎస్వీ ఫిలింస్‌ పతాకంపై విప్లవ్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ కెఎస్వీ నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'హితుడు'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ పోస్టర్లు విడుదల అయ్యాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత కెఎస్వీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కెఎస్వీ మాట్లాడుతూ - ''చక్కని సందేశంతో రూపొందిన ఈ చిత్రంలో సందేశంతోపాటు ఒక కమర్షియల్‌ చిత్రానికి వుండాల్సిన అని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి. ఈ చిత్రం ద్వారా విప్లవ్‌ని దర్శకుడుగా పరిచయం చేస్తున్నాం. దర్శకుడు విప్లవ్‌ మాట్లాడుతూ - ''విద్య ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకురావాలని అహర్నిశలు పరితపించే ఆదర్శ విలువలు కలిగిన సీతారామ్‌ పాత్రలో జగపతిబాబుగారు జీవించారు. అందరూ ఆదర్శంగా తీసుకోదగిన ఉన్నతమైన పాత్ర అది. మంచి సందేశంతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా జోడించి ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు విప్లవ్‌ .  
« PREV
NEXT »

No comments

Post a Comment