తాజా వార్తలు

Monday, 28 September 2015

విజయవాడలో గుర్రం జాషువా కాంస్య విగ్రహం

రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గుర్రం జాషువా కాంస్య విగ్రహం ఏర్పాటయింది. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద గుర్రం జాషువా కాంస్య విగ్రహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. జాషువా విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి విగ్రహానికి గజమాల వేసి నివాళులు సమర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, జాషువా 120వ జయంతి సందర్భంగా విజయవాడలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్ఠంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయనను కవి లోకంలో చరిత్ర కారుడని, ఆయనను అందరు గుర్తుపెట్టుకోదగిన వ్యక్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా జాషువా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి ప్రసాద్‌ను దుశ్శాలవుతో సీఎం సత్కరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment