తాజా వార్తలు

Saturday, 12 September 2015

సెప్టెంబర్ 15న ప్రత్యేకహోదా సాధనకోసం తిరుపతిలో వైఎస్ జగన్ తరగతులు

స్పెషల్ స్టేటస్ ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు తిరుపతి వేదికగా మరోసారి జననేత, ప్రతిపక్ష నాయకుడు  వైఎస్ జగన్ గళమెత్తనున్నారు. ప్రత్యేకహోదా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈనెల 15న తిరుపతికి వెళుతున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రత్యేకహోదా-ఉద్యోగఅవకాశాలు-రాష్ట్రాభివృద్ధి అంశంపై వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. జననేత రాక కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  సదస్సులో పాల్గొనేందుకు ఉత్సూహకత చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువకులు. విద్యార్థులు. ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈనెల 26 నుంచి గుంటూరులో  వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్షకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ప్రత్యేకహోదాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.   వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలో సదస్సు జరుగుతుంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment