తాజా వార్తలు

Sunday, 13 September 2015

ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు-కడియం

తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యానికి షాకిచ్చారు. ఫీజుల పేరిట విద్యార్థులను వేధించవద్దని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ఎటువంటి ఇబ్బంది కలిగించినా తమకు సమాచారమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ కళాశాలకు ప్రభుత్వ గుర్తింపు రద్దు చేస్తామని ఆయన తెలిపారు. వరంగల్ లో నిర్వహించిన జూనియర్ కళాశాలల సంఘం రాష్ట్ర సదస్సుకు హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఇంటర్మీడియట్ బోర్డులో అవినీతిని ప్రోత్సహించింది ప్రైవేటు కళాశాలలేనని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి తావు లేకుండా ఆన్ లైన్ విధానం తీసుకొస్తున్నామని  చెప్పారు. 2016 విద్యా సంవత్సరానికి సంబంధించిన బోధనా రుసుము ముందే చెల్లిస్తామని చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment