తాజా వార్తలు

Sunday, 6 September 2015

జయసూర్య రివ్యూ

జయసూర్యలో విశాల్, కాజల్ జంట చూడముచ్చటగా ఉంది. 
 విశాల్‌ ఏ పాత్రలోనైన ఒదిగిపోయే నటించే సత్తాగల నటుడు. తనకి పోలీస్‌ పాత్రలు చెయ్యడం కొత్తేమీ కాదు. ఎప్పటిలానే తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్‌గా, బాధ్యత గల కొడుకుగా, వృత్తి కోసం ప్రాణాలకు తెగించే పోలీస్‌గా తనదైన శైలి నటనతో మంచి మార్కులే తెచ్చుకున్నాడు. హీరోయిన్‌ కాజల్‌ పేరుకే హీరోయిన్‌ అన్నట్టు కనిపించింది. ఆమె పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం కనిపించలేదు. కేవలం పాటలకే పరిమితం అయింది. జయసూర్యకు అన్నగా, మంత్రి కావాలనే కాంక్షతో హత్యలు చెయ్యడానికి, అక్రమంగా డబ్బు సంపాదించడానికి వెనకాడని శ్రీనివాస్‌గా దర్శకుడు సముద్రఖని అద్భుతమైన నటన కనబర్చాడు. మురళీశర్మ కీలక పాత్రతో ఆకట్టుకున్నాడు. కమెడీయన్‌ సూరి కానిస్టేబుల్‌ పాత్రలో నవ్వించడానికి ట్రై చేశాడు. ఆర్‌.కె, జయప్రకాశ్‌ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టు యాక్ట్‌ చేశారు. నిఖితా ఓ ప్రత్యేక పాటతో ఆకట్టుకుంది. 
కథ విషయానికి వస్తే.. 
విశాల్‌ వైజాగ్‌కి కొత్తగా వచ్చిన సిన్సియర్‌ ఎసీపీ. . తన విధులను నిర్వర్తించడానికి 15 రోజుల ముందు నుంచే వైజాగ్‌లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తాడు. విశాఖలోని ఓ గ్యాంగ్‌ వ్యాపారస్తులందరిని బెదిరించి డబ్బు వసూలు చేసే పనిలో ఉంటారు. డబ్బు ఇవ్వమని ఎదురుతిరిగిన వారిని కిరాతకంగా చంపుతారు. దీనంతటికి కర్త, కర్మ, క్రియ శ్రీను అలియాస్‌ శ్రీనివాస్‌(దర్శకుడు సముద్రఖని). తన పనికి అడ్డొస్తే తండ్రని కూడా చూడకుండా చంపాలనుకునే క్రూరమైన వ్యక్తి. అతనికి, జయసూర్యకు సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ. 

« PREV
NEXT »

No comments

Post a Comment