తాజా వార్తలు

Wednesday, 9 September 2015

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

ప్రజాకవి కాళోజీ నారాయణరావు 101వ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, సాంస్కృతిక సారథి అధ్యక్షులు రసమయి బాలకిషన్‌తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం మాట్లాడుతూ.. కాళోజీ జయంతిని భాషా దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా గొప్పవిషయమన్నారు. ప్రజా సమస్యలపై కడదాకా పోరాడిన గొప్ప వ్యక్తి కాళోజీ అని గుర్తు చేశారు. అటు హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. కాళోజీ గొప్ప వ్యక్తి.. ఆయన విప్లవాలకు నిలయమన్నారు. విప్లవ ఉద్యమంలో కాళోజీ చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. కాళోజీ రచనలు ప్రజలను చైతన్య పరిచాయని తెలిపారు. కాళోజీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు నాయిని. 
« PREV
NEXT »

No comments

Post a Comment