తాజా వార్తలు

Wednesday, 2 September 2015

'కంచె' ట్రైలర్‌ విడుదల

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మాతలు.  ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్ 1, మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి, మెగాబ్రదర్ నాగబాబు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ ''క్రిష్ గారు కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అయితే లోపల ఇదొక పీరియడ్‌ ఫిలిం, 1940 బ్యాక్‌డ్రాప్‌ ఎలా వస్తుందోనని చిన్న భయం ఉండేది. కానీ రీరికార్డింగ్‌ సమయంలో సినిమా చూశాను. ఎక్‌ట్రార్డినరీగా వచ్చింది. మా రెండు గంటల సినిమా ఎలా ఉంటుందో చెప్పే చిన్న ఎగ్జాంపిలే ఈ ట్రైలర్‌. క్రిష్‌ నుండి ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment