తాజా వార్తలు

Sunday, 13 September 2015

ఎడారి నట్టనడుమ మిరాకిల్ గార్డెన్

ఎడారి నట్టనడుమ వెలసిన పూల హరివిల్లు దుబాయ్ మిరాకిల్ గార్డెన్.  అద్భుత పూల పరిమళాలకు పుష్పాలంకారాలకు ఇక్కడ కొదువలేదు. దుబాయ్‌లో పేరొందిన అరేబియన్ రాంచెస్ కు అతిసమీపంలోనే ఈ గార్డెన్ ఉంది. దీని సోయగాలు ఇప్పటికే గిన్నెస్ రికార్డుల్లోకీ ఎక్కాయి.
పేరుకు తగ్గట్టు ఈ పూలతోటలు సందర్శకులను మైమరిపింపజేస్తాయి. 
ప్రపంచవ్యాప్తంగా గల సుమారు 45 రకాల విలక్షణ పుష్పజాతులను సేకరించి ఇక్కడ పెంచుతున్నారు. సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో మొత్తంగా దాదాపు 4.5 కోట్లు పూలు ఇక్కడి వనాల నిండా పరిమళాలను వెదజల్లుతున్నట్టు ఒక అంచనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పూలవనంగా పేరొందింది.  దీనిని హరివిల్లు తోట (రెయిన్‌బో గార్డెన్) అని ఎందుకన్నారంటే కాలానికి తగ్గట్టు ఇక్కడి పూల ప్రదర్శనల్లో మార్పులు తెస్తుంటారు కాబట్టి. వాటిలో యుఎఇకి చెందిన పూల పతాకం, పూల గడియారం, పూలతో అలంకృతమైన ఓ ఫెర్రారీ కారు, పూల యాపిళ్లు, కృత్రిమ జంతువులు, పూల పడవలు, ఒక ఇస్లామిక్ ఆర్చ్ డిజైన్ వంటివెన్నో పర్యాటకులను గొప్పగా ఆకర్షిస్తాయి. ఎటువైపు, ఏ డిజైన్‌లో చూసినా రంగురంగుల పూలే. వాటి అనంతమైన ప్రవాహాలే కనిపిస్తాయి.  
« PREV
NEXT »

No comments

Post a Comment