తాజా వార్తలు

Friday, 18 September 2015

మయూరి రివ్యూ

మయూరి ప్రేక్షకులను భయపెట్టింది. ఫుల్ లెంగ్త్ హ‌ర్ర‌ర్ డ్రామాను భ‌య‌పెట్టేలా చెప్పిన విధానం బాగుంది. హ‌ర్ర‌ర్ సినిమాల‌ను బాగా ఇష్ట‌ప‌డేవారికి ఈ మూవీలో కొన్ని ఎలిమెంట్స్ బాగా న‌చ్చుతాయి. సినిమా స్టార్టింగ్, ఇంట‌ర్వెల్ బ్యాంగ్ సినిమాకు మెయిన్ హైలెట్‌. సినిమాటోగ్ర‌ఫీ, సౌండ్ ఆడియ‌న్స్‌ను బాగా భ‌య‌పెట్టాయి. నయనతార మంచి లుక్ తో కనపడుతూనే, పాపకు తల్లిగా, పరిస్థితలును ఫేస్ చేసే యువతిగా చక్కని నటనను కనపరిచింది. సినిమా మొత్తాన్ని త‌న భుజ‌స్కంధాల‌పై మోసినా ఆమె మాత్రం ప్రేక్ష‌కుల‌ను ఎక్క‌డా భ‌య‌పెట్ట‌లేదు. సెకండాఫ్‌లో సినిమా వేగం త‌గ్గ‌డంతో పాటు క్లైమాక్స్ మ‌రింత సాగ‌దీసిన‌ట్టు ఉంది. అయితే డైరెక్ట‌ర్ చాలా లాజిక్‌ల‌ను మిస్ అయ్యాడు. సెకండాఫ్‌లో న‌య‌న‌తార పాత్ర‌కు స‌రైన ప్ర‌యారిటీ లేదు స‌రిక‌దా…చాలా చోట్ల క‌థ ప్రేక్ష‌కుల‌ను క‌న్‌ఫ్యూజ్ చేసేస్తుంది. క్లైమాక్స్ కూడా మ‌రీ తేల్చేశాడు. సాంకేతిక నిపుణుల్లో ముందుగా రాన్ ఎథ‌న్ యోహాన్ అందించిన సంగీతం, ఆర్ ఆర్ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. సినిమాలో చాలా సీన్ల‌లో హ‌ర్ర‌ర్ మూడ్ క్యారీ చేయ‌డంలో యోహాన్ స‌క్సెస్ అయ్యాడు. హంగేరీలో చేయించి రీ రీకార్డింగ్ కూడా హైలెట్‌. అలాగే సినిమాటోగ్రాఫ‌ర్ స‌త్య‌మ్ సూర్య‌న్ సినిమాటోగ్ర‌ఫీ కూడా హ‌ర్ర‌ర్ మూడ్‌ను బాగా క్యాప్చ‌ర్ చేసింది. టీఎన్‌.సురేష్ సెకండాఫ్‌లో కొన్ని సీన్ల‌ల‌ను బాగా ఎడిట్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు, సీ క‌ళ్యాణ్ డ‌బ్బింగ్ విలువ‌లు బాగున్నాయి.
కథాంశం...న‌య‌న‌తార‌, అరి భార్యభర్తలు. అనివార్య కార‌ణాల వ‌ల్ల వీరిద్ద‌రు విడిపోతారు. దాంతో మయూరి తన స్నేహితురాలు స్వాతి ఇంట్లో తన పాపతో మీరాతో కలిసి ఉంటుంది. ఇదిలా ఉంటే మాయావ‌నం అనే భ‌యంక‌ర‌మైన అడ‌విలో మాయ అనే మ‌హిళ ఆత్మ తిరుగుతుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఆ ప్రాంతం చాలా డేంజ‌ర్ ఫారెస్ట్‌గా నిలుస్తుంది. దీనిపై ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గ‌డంతో పాటు ఓ సినిమా కూడా తెర‌కెక్కుతుంది. మ‌యూరికి అప్పులు ఎక్కువ‌గా ఉండ‌డంతో అప్పుల వాళ్లు అమెను వేధిస్తుంటారు. ఆ టైంలో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆర్.కె. తను రూపొందించిన చీకటి అనే సినిమాని ఒంటరిగా చూస్తే ఐదు లక్షల రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేస్తాడు. తనకున్న ఇబ్బందుల వ‌ల్ల మయూరి ఆ సినిమాని చూడటానికి ఒప్పుకుంటుంది. ఆ సినిమా చూస్తున్నప్పుడే మయూరికి, ఆ సినిమాకు ఒక సంబంధం ఉందన్న నిజం తెలుస్తుంది. అసలు మయూరి జీవితానికి, ఆ సినిమాకు ఉన్న సంబంధం ఏంటి? సినిమా చూసిన తర్వాత మయూరి జీవితంలో వచ్చే మార్పులేమిటి అన్న‌దానికి తెర‌మీదే స‌మాధానం దొరుకుతుంది.   
« PREV
NEXT »

No comments

Post a Comment