తాజా వార్తలు

Friday, 11 September 2015

ముంబై పేలుళ్లలో 12మంది దోషులు-మోకా కోర్టు తీర్పు

ముంబై లోకల్ రైళ్లలో వరుస పేలుళ్ల కేసుపై 9 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం మోకా కోర్టు తీర్పు వెల్లడించింది. మొత్తం 13 మంది నిందితుల్లో ఒకరిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు.. మిగితా 12 మందిన దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితులు ఎతేషామ్ సిద్ధిఖీ, కమల్ అన్సారీ, ఫైజల్ షేక్, నవేవ్ హుస్సేన్ లను దోషులుగా నిర్ధారించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా అబ్దుల్ హుస్సేన్ అనే నిందితున్ని నిర్దోషిగా ప్రకటించింది. దోషులకు ఈ నెల 14న శిక్షలు ఖరారు చేయనున్నట్లు న్యాయస్థానం స్పష్టంచేసింది. కాగా కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని బాధితుల తరఫు న్యాయవాది తెలిపారు. 2006 జూలై 11న ముంబై లోకల్ రైళ్లలో జరిగిన వరుస పేలుళ్లలో 188 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment