తాజా వార్తలు

Wednesday, 16 September 2015

సెప్టెంబర్ 27న ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. 30 ఏండ్ల తరువాత సెప్టెంబర్ 27న చంద్రుడు భూమికి అతి సమీపంలోకి రాబోతున్నాడు. అదే రోజున సంపూర్ణ చంద్రగ్రహణం కూడా సంభవించనున్నది. గంటకు పైగా భూమి చంద్రుడిని కప్పివేస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. గంట 12 నిమిషాలపాటు కొనసాగే సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో పూర్తిగా కనిపిస్తుందని, భారత్‌తోపాటు పశ్చిమాసియా, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో మాత్రం పాక్షికంగా కనిపిస్తుందని పేర్కొంది. చంద్రగ్రహణం రాత్రి సమయంలో సంభవించనున్నందున ఎటువంటి ముసుగులు లేకుండా దానిని చూడవచ్చని తెలిపింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment