తాజా వార్తలు

Saturday, 26 September 2015

తగ్గిన చికెన్ ధరలు

ఏపీలో చికన్ ధరలు భారీగా తగ్గాయి. శ్రావణమాసం ఆరంభం నుంచి తగ్గుముఖం పట్టిన చికెన్‌ ధరలు ప్రస్తుతం గణేష్‌ నవరాత్రుల నేపథ్యంలో మ రింత దిగజారాయి.  దీంతోపాటు మార్కెట్‌లో పోటీ తీవ్రమైంది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ధరలు భారీగా దిగజారుతున్నాయి. వేసవిలో ఎండకంటే మండిన చికెన్‌ ధర ప్రస్తుతం అందులో సగా ని కంటే ఇంకా తగ్గింది. మరోవైపు కోళ్ల ఫారా ల్లో కోళ్లు అమ్ముడుపోకపోవడం నిర్వాహకులకు భారంగా మారింది. దాణా, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతుండటంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా కోళ్ల ఫారం నిర్వాహకులు 40 నుంచి 50 రోజుల వయసులో కోళ్లను విక్రయిస్తుంటారు. అంత కు మించిన వయసు ఉన్న కోళ్లను ఉంచు కుంటే దాణా ఖర్చు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కోళ్లఫారాల నిర్వాహకులు తమ వద్ద ఉన్న కోళ్లను అమ్ముకునేందుకు ధర తగ్గిస్తున్నారు.  ప్రస్తుతం కిలో చికెన్‌ రూ. 80 నుంచి రూ. 100 మధ్యన అమ్ముతున్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment