తాజా వార్తలు

Monday, 28 September 2015

కాకినాడ నుండే పవర్‌స్టార్ పోటీ ....???కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తారని గట్టిగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి పవన్ కూడా అప్పట్లో సానుకూలంగా స్పందించారు. అయితే 2014 ఎన్నికలకు జనసేన దూరంగా ఉంటుందని ప్రకటించడంతో తెలుగుదేశం నేతల్లో ఆనందం వెల్లివిరిసింది. తెలుగుదేశానికి మద్దతుపలికిన పవన్ అప్పట్లోమ అనందం వెల్లివరిసింది.
తెలుగుదేశానికి మద్దతు పలికిన పవన్ అప్పట్లో కాకినాడ నగరానికి వచ్చారు. ఎన్నికలకు రెండురోజుల ముందుగా నిర్వహించిన బహిరంగ సభలో తెలుగుదేశం అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. ఫలితంగా మంచి స్పందనే లభించింది.
అయితే 2019 ఎన్నికల్లో పవన్ కాకినాడ నుండి తప్పక పోటీ చేస్తారంటూ ఆయన అభిమానులు తాజాగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే లేక ఎంపి రెండిట్లో ఏదో స్థానానికి కాకినాడ నుండే పవర్‌స్టార్ పోటీ చేయడం తథ్యమని ఇప్పటి నుండీ ఆయన అభిమానులు నమ్మకంగా చెబుతుండటం విశేషం!

News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment