తాజా వార్తలు

Friday, 18 September 2015

కొరియర్ బాయ్ కళ్యాణ్ రివ్యూ

నూతన కథాంశంతో కొరియర్ భాయ్ కళ్యాణ్..కాస్త ఆకట్టుకున్నాడు. స్టెమ్ సెల్స్' అనే సరికొత్త కాన్సెప్ట్ తో థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా స్టోరీ లైన్ వింటే హాలీవుడ్ స్థాయిలో అనిపించి హీరో నితిన్ ఇంటర్వ్యూలలో చెప్పినట్టుగానే షాక్ కి గురవుతారు. ఆ విషయంలో దర్శకుడు ప్రేమ సాయి మంచి మార్కులే పొందాడు. అయితే అంత మంచి స్క్రిప్ట్ ని అంతే నిజాయితీగా తెరకెక్కించడంలో మాత్రం దర్శకుడు కొంత మేరకు విఫలమయ్యాడు. సినిమాలో అనవసర లవ్ సీన్లు, పాటలు జోడించి ఫీల్ ని మిస్ చేయడం బాధాకరం. ఇవన్నీ మినహాయించి వుంటే సినిమా మరింత బిగువుగా నడిచేది.  ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకి కధే హీరో కాబట్టి హీరోగా ఎవరు చేసినా కదే డామినేట్ చెయ్యడం సహజం. నితిన్ మరియు మిగిలిన బ్యాచ్ కధకు తగ్గట్టుగా చేసుకుపోయారంతే. స్పూఫ్ సినిమాల మీద బ్రతుకుతున్న సంపూని స్పూఫ్ చెయ్యడం వెరైటీ ఆలోచన. సంగీత దర్శకులు అందించిన  పాటలు వినడానికి బాగున్నా టైమింగ్ లోపంకారణంగా చూడడానికి ఎబ్బెట్టుగా వున్నాయి. మొత్తానికి ప్రేమ్ సాయిలో విషయం వున్నా అనవసర విషయాల జోలికి పోయి సినిమాను పాడుచేసుకున్నాడు. కమర్షియల్ కుదింపులకారణంగా ఒక మంచి సినిమా కాస్తా ఒక మంచి ప్రయత్నంగా మారిపోవడం బాధాకరం.  
« PREV
NEXT »

No comments

Post a Comment