తాజా వార్తలు

Wednesday, 2 September 2015

కార్మిక సంఘాల సమ్మె గ్రాండ్ సక్సెస్


కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని మోడీ సర్కార్.. దిగి వచ్చే వరకు ఆందోళనలు విరమించేది లేదని కార్మికసంఘాల నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఇవాళ భారత దేశం స్తంభించింది. అర్థరాత్రి నుంచే బస్సులు, లారీలు, ట్యాక్సీలు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పది కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టడంతో వీటి పరిధిలోని 15 కోట్ల మంది కార్మికులు విధులను బహిష్కరించారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంఘాలు, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారు సైతం సమ్మెకు తమ మద్దతును ప్రకటించారు. ప్రజారవాణా పూర్తిగా స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. సింగరేణి కార్మికులు ఒక రోజు సమ్మెకు దిగారు. జాతీయ సార్వత్రిక సమ్మెకు సింగరేణి గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మద్దతు తెలపడంతో సింగరేణిపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనడంతో.. దాదాపు 63వేల మంది కార్మికులు విధులను బహిష్కరించారు. మొత్తం 32 భూగర్భ బొగ్గు గనులు.. 17 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్క రోజు సమ్మెతో 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో.. 40 కోట్ల నష్టం వాటిల్లింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment