తాజా వార్తలు

Friday, 18 September 2015

జోరుగా రెండో విడుత హరితహారం

వర్షాలు జోరుగా కురుస్తుండటంతో తెలంగాణ వ్యాప్తంగా రెండో విడుత హరితహారం ఊపందుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక్క రోజే లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డులలో శుక్కవారం ఇంటింటికి పది మొక్కలు పంపిణీ చేశారు. అందరూ ఈ మొక్కలను తమ ఇండ్లు, కాలనీలలో నాటాలని టిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా హరిత తెలంగాణ లక్ష్యంగా మొక్కలు నాటుతున్నామని జనం చెబుతున్నరు. 
« PREV
NEXT »

No comments

Post a Comment