తాజా వార్తలు

Tuesday, 1 September 2015

సిరియా దేశం విడిచిన ఐదు లక్షలమంది

సిరియా దేశం నుంచి ఐదేళ్లలో ఐదు లక్షల మంది వలసలబాట పట్టారు. మరోవైపు దేశంలో వలసలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పొరుగు దేశాలకు వలస వెళుతున్న శరణార్థుల సంఖ్య ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 2 లక్షలకు చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపూ 83శాతం ఎక్కువ. హింస అంతకంతకూ పెరుగుతుండడంతో వలసవెళ్ళేవారి సంఖ్య కూడా పెరుగుతోందని గతంలోనే ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజన్సీ తెలిపింది.  సిరియా నుంచి ప్రజలు భారీ సంఖ్యలో యూరప్‌లోకి ప్రవేశిస్తున్నారు. లిబియా కేంద్రంగా జల మార్గంలో అక్రమంగా యూరప్ కంట్రీల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇలా ఇతర దేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్య ఈ ఐదేళ్లలో 50 లక్షలు దాటినట్లు అంచనా. దేశంలో ఉండలేక పరాయి దేశంలో నిలువ నీడ లేక సిరియా దేశస్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. కట్టుబట్టలతో ఇతర దేశాలకు తరలివెళ్తున్న వారికి ఉపాధి ఉండటం లేదు. పిల్లలకు చదువు చెప్పించే పరిస్థితి లేదు. చాలా మంది కూలీ, నాలీ చేసుకుంటూ దినదిన గండంలా జీవితాన్ని గడుపుతున్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment