తాజా వార్తలు

Saturday, 19 September 2015

మృత్యువుతో సిరియా శరణార్థులు చెలగాటం

సిరియా శరణార్థులు మృత్యువుతో చెలగాటమాడుతున్నరు. సిరియా నుంచి గ్రీస్, జర్మనీకి వలస వెళ్తున్న శరణార్థులు చిన్న చిన్న రబ్బరు బోట్లతో సముద్ర ప్రయాణం చేస్తుండటం తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి. 
సిరియా నుంచి గ్రీస్‌కు 15మంది శరణార్థులతో వస్తున్న రబ్బరు బోటు టర్కీలోని ఇజ్మీర్ ప్రావిన్స్ వద్ద మునగడంతో నాలుగేండ్ల సిరియా బాలిక మృతిచెందింది. బోటు మునగడాన్ని గమనించిన టర్కీ కోస్టుగార్డులు 14మందిని రక్షించారు. బాలిక మృతదేహం ఇజ్మీర్ ప్రావిన్స్‌లోని సెస్మె బీచ్‌కు కొట్టుకువచ్చింది. కాగా, ఈ ఏడాది ప్రారంభంనుంచి గ్రీస్‌కు వస్తున్న సిరియా, ఆఫ్ఘన్ శరణార్థుల సంఖ్య 2.50లక్షలకు చేరింది. శుక్రవారం కూడా గ్రీస్‌లోని లెస్బోస్ దీవికి టర్కీ నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు చేరుకున్నారు. శరణార్థులు భారీగా పోటెత్తుతుండటంతో యూరప్ దేశాలు సరిహద్దులను మూసివేస్తున్నాయి. భారీగా ముళ్లకంచెలు ఏర్పాటుచేస్తున్నాయి. రైళ్ల రాకపోకలను సైతం నిలిపివేశాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment