తాజా వార్తలు

Wednesday, 2 September 2015

ఆగస్ట్ రెండో వారంలో షర్మిళ పరామర్శయాత్ర

వైఎస్సార్ సీపీ నేత షర్మిల... వంరగల్ జిల్లాలో మలివిడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆమె జిల్లాలో పర్యటిస్తారు. మహబూబాబాద్, నర్సంపేట, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో  కలియ తిరగనున్నారు. ఈమేరకు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, వరంగల్ పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో రెండో విడత పరామర్శయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈసమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు శాంతికుమార్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అప్పం కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 28న జిల్లాలో షర్మిల  మొదటి విడత పరామర్శ యాత్ర ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 7 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వారి సాధకబాధలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని బాధితులకు పూర్తి భరోసా ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు షర్మిల వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment