తాజా వార్తలు

Friday, 18 September 2015

ఏఈఈ జీఎస్ పేపర్ తెలుగు మీడియంలోనే

ఈ నెల 20న ఏఈఈ పరీక్షకు హాజరయ్యే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఊరట లభించింది. ఎల్లుండి జరిగే ఈ పరీక్షకు 31 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షకు జనరల్ స్టడీస్ పేపర్ ఇంగ్లీస్‌లో నిర్వహించాలని మొదట నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష రాసే అభ్యర్థులకు జనరల్ స్టడీస్ పరీక్ష ఇంగ్లీష్‌లో నిర్వహించడం వల్ల నష్టం జరుగుతుందని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సమావేశం నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్‌ను తెలుగు ఇంగ్లీష్ లో నిర్వహించాలని నిర్ణయించింది. రెండో పేపర్ మాత్రం ఇంగ్లీష్‌లో రాయాల్సి ఉంటుంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment