తాజా వార్తలు

Wednesday, 2 September 2015

వైఎస్సార్ కు ఘన నివాళి

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు వైఎస్ సమాధి వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నివాళులు అర్పించినవారిలో వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలమ్మ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ సుధాకర్ రెడ్డి, వైఎస్ పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు ఉన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment