తాజా వార్తలు

Tuesday, 8 September 2015

అల్లు అర్జున్ భార్య కు ఏమైంది
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతోంది. ఇక్కడ బన్నీ కి విలన్స్ కు మధ్య యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో బన్నీకి  యాక్సిడెంట్ జరిగి గాయపడ్డాడని అందుకే బన్నీ  హాస్పటల్ కు వెళ్ళాడనే  రూమర్స్ ఫిల్మ్ నగర్ లో వినిపించాయి. అయితే ఈ వార్తలను బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఖండించారు. బన్నీ కి ఎలాంటి  ప్రమాదం జరగలేదని స్పష్టం చేసాడు. బన్నీ భార్య స్నేహ కు మైనర్  సర్జరీ చేయించాల్సి ఉండటం తో ఆమెతో కలిసి బన్నీ హాస్పిటల్ కు వెళ్ళినట్లు స్పష్టం చేసాడు అల్లు అరవింద్. దీంతో బన్నీ ఫాన్స్ కొంత కుదట పడ్డారు.
« PREV
NEXT »

No comments

Post a Comment