తాజా వార్తలు

Saturday, 19 September 2015

త్వరలో రోమాన్స్ చేయనున్న అమలాపాల్-విష్ణు..?

అమలాపాల్‌ నటనకు మాత్రం స్వస్తి చెప్పలేదు. మునుపటిలా వరుస సినిమాలకు అంగీకరించినప్పటికీ.. తన మనసుకు నచ్చిన పాత్రలకు ఓకే చెపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సూర్య నిర్మిస్తున్న ఓ తమిళ చిత్రంలో నటించిన అమలాపాల్.. తాజాగా తెలుగులోనూ ఓ చిత్రంలో నటించబోతోందట. జెండాపై కపిరాజు సినిమా తర్వాత తెలుగులో మరో సినిమాకు సైన్ చేయని అమలాపాల్.. ఇప్పడు మంచు విష్ణు సినిమా కోసం మళ్లీ టాలీవుడ్‌కు వస్తోందట. మంచు విష్ణు హీరోగా జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. సోనారిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఓ కీలకపాత్ర కోసం అమలాపాల్ ను సంప్రదించారట. చిత్ర కథతో పాటు తన పాత్ర కూడా అమలాపాల్ కు నచ్చిందట.  
« PREV
NEXT »

No comments

Post a Comment