తాజా వార్తలు

Tuesday, 29 September 2015

అంబటి సైకిలెక్కేందుకు సుముఖంగా లేడు అంట...?...చూద్దాం..!!!మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకెళ్దామనుకున్నారు అంబటి రాంబాబు. తృటిలో ఆ ఛాన్స్‌ మిస్సయ్యింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సన్నిహితులకి, అభిమానులకి సంకేతాలు పంపేసి కూడా డొక్కా, చివరి నిమిషంలో మనసు మార్చుకుని సైకిలెక్కేశారు. దాంతో, అంబటి రాంబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. అప్పటినుంచీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంబటి ప్రాభవం తగ్గుతూ వస్తోందిట.
ఈ ఎపిసోడ్‌ తర్వాత అంబటి రాంబాబుని ఎలాగైనా తెలుగుదేశం పార్టీలోకి లాక్కురావాలని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ప్రయత్నిస్తున్నారట. దీనికి డొక్కా రాజకీయ గురువు, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అంబటి రాంబాబు మాత్రం, సైకిలెక్కేందుకు సుముఖంగా కనిపించడంలేదు. దాంతో, పొలిటికల్‌ గేమ్‌ షురూ చేశాయి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు.
'అంబటి మావాడే.. అతి త్వరలో మా పార్టీలోకి వచ్చేస్తాడు..' అంటూ తెలుగు తమ్ముళ్ళు రూట్‌ లెవల్‌లో ప్రచారం ఉధృతంగా చేపడ్తున్నారు. 'అంబటీ సైకిలెకే్కదెప్పుడు.?’ అన్న డిస్కషన్ గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రముఖంగా జరుగుతోందిప్పుడు. దాంతో, అంబటి రాంబాబు మరింత గట్టిగానే, ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. ఏం చేసినా, ఇదివరకటిలా అంబటి రాంబాబుకి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో మైక్‌ దొరకడంలేదన్నది కాదనలేని వాస్తవం. అందుక్కారణాలు అనేకం.
ఇటీవలి కాలం
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకెళ్దామనుకున్నారు అంబటి రాంబాబు. తృటిలో ఆ ఛాన్స్‌ మిస్సయ్యింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సన్నిహితులకి, అభిమానులకి సంకేతాలు పంపేసి కూడా డొక్కా, చివరి నిమిషంలో మనసు మార్చుకుని సైకిలెక్కేశారు. దాంతో, అంబటి రాంబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. అప్పటినుంచీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంబటి ప్రాభవం తగ్గుతూ వస్తోందిట.
ఈ ఎపిసోడ్‌ తర్వాత అంబటి రాంబాబుని ఎలాగైనా తెలుగుదేశం పార్టీలోకి లాక్కురావాలని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ప్రయత్నిస్తున్నారట. దీనికి డొక్కా రాజకీయ గురువు, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అంబటి రాంబాబు మాత్రం, సైకిలెక్కేందుకు సుముఖంగా కనిపించడంలేదు. దాంతో, పొలిటికల్‌ గేమ్‌ షురూ చేశాయి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు.
'అంబటి మావాడే.. అతి త్వరలో మా పార్టీలోకి వచ్చేస్తాడు..' అంటూ తెలుగు తమ్ముళ్ళు రూట్‌ లెవల్‌లో ప్రచారం ఉధృతంగా చేపడ్తున్నారు. 'అంబటీ సైకిలెకే్కదెప్పుడు.?’ అన్న డిస్కషన్ గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రముఖంగా జరుగుతోందిప్పుడు. దాంతో, అంబటి రాంబాబు మరింత గట్టిగానే, ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. ఏం చేసినా, ఇదివరకటిలా అంబటి రాంబాబుకి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో మైక్‌ దొరకడంలేదన్నది కాదనలేని వాస్తవం. అందుక్కారణాలు అనేకం.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ, రోజా.. ఇలా పలువురు వైఎస్సార్సీపీలో ముఖ్య నేతలుగా చెలామణీ అవుతున్నారు. ఏ విషయమ్మీద మాట్లాడాలన్నా ఆ ముఖ్య నేతలు మాత్రమే మీడియా ముందుకొస్తుండడంతో అంబటి రాంబాబుకి తన ఆవేదన వెల్లగక్కుకునే అవకాశం తగ్గిపోతోంది. జగన్‌తో అంబటికి సత్సంబంధాలు తెగిపోయాయా.? కావాలనే అంబటిని సైడేసేస్తున్నారా.? అన్న విషయాల్ని పక్కన పెడితే, తాను సైకిలెక్కబోనని గట్టిగా చెప్పుకోవడానికి పార్టీలో అవకాశం దక్కకపోవడం అంబటిని మరింత ఆవేదనకు గురిచేస్తోందిట.
మొత్తమ్మీద, టీడీపీ మైండ్‌ గేమ్‌ వర్కవుట్‌ అయితే అంబటి, అతి త్వరలో సైకిల్‌ ఎక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి మైండ్‌ గేమ్‌తోనే రాజకీయాల్లో ఎక్కువమంది పార్టీలు మారుతుంటారన్నది జగమెరిగిన సత్యం. చూద్దాం.. అంబటి పొలిటికల్‌ కెరీర్‌ ఎలాంటి మలుపులు తిరగనుందో.!
లో బొత్స సత్యనారాయణ, రోజా.. ఇలా పలువురు వైఎస్సార్సీపీలో ముఖ్య నేతలుగా చెలామణీ అవుతున్నారు. ఏ విషయమ్మీద మాట్లాడాలన్నా ఆ ముఖ్య నేతలు మాత్రమే మీడియా ముందుకొస్తుండడంతో అంబటి రాంబాబుకి తన ఆవేదన వెల్లగక్కుకునే అవకాశం తగ్గిపోతోంది. జగన్‌తో అంబటికి సత్సంబంధాలు తెగిపోయాయా.? కావాలనే అంబటిని సైడేసేస్తున్నారా.? అన్న విషయాల్ని పక్కన పెడితే, తాను సైకిలెక్కబోనని గట్టిగా చెప్పుకోవడానికి పార్టీలో అవకాశం దక్కకపోవడం అంబటిని మరింత ఆవేదనకు గురిచేస్తోందిట.
మొత్తమ్మీద, టీడీపీ మైండ్‌ గేమ్‌ వర్కవుట్‌ అయితే అంబటి, అతి త్వరలో సైకిల్‌ ఎక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి మైండ్‌ గేమ్‌తోనే రాజకీయాల్లో ఎక్కువమంది పార్టీలు మారుతుంటారన్నది జగమెరిగిన సత్యం. చూద్దాం.. అంబటి పొలిటికల్‌ కెరీర్‌ ఎలాంటి మలుపులు తిరగనుందో.!
News Desk -AP
« PREV
NEXT »

No comments

Post a Comment