తాజా వార్తలు

Tuesday, 8 September 2015

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ వస్తున్నారా...???

గవర్నర్‌ నరసింహన్‌, ఇంకా తాను తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగలేనంటూ ఢిల్లీ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారట. గత కొంతకాలంగా మీడియాలో ఇదే తరహాలో కథనాలు విన్పిస్తున్నాయి. ఇదిప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన వ్యవహారమేమీ కాదు. చాన్నాళ్ళుగా ఇదే తంతు నడుస్తూనే వుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌, ఆ సమయంలోనే ఆ పదవి నుంచి తప్పుకోవాలని ప్రయత్నించారంటూ నేషనల్‌ మీడియాలోనూ కథనాలు విన్పించాయి. నరసింహన్‌ మాత్రం, తన పని తాను చేసుకుపోతున్నారు. పలుమార్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది కేంద్రం.  ఈసారి కాస్త గట్టిగా, నరిసింహన్‌ స్థానంలో కేరళ గవర్నర్‌ సదాశివం రాబోతున్నారనే ఊహాగానాలు తెరపైకొచ్చాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం కీలకమైన ముందడుగు వేసిందనీ, అందులో భాగంగానే నరసింహన్‌ మార్పు వుండొచ్చన్నది ఆ కథనాల సారాంశం. వాస్తవానికి, నరసింహన్‌ రెండు రాష్ట్రాలకీ సుపరిచితుడు. ఇద్దరు ముఖ్యమంత్రులతోనూ నరసింహన్‌కి సఖ్యత వుంది. ఈ నేపథ్యంలో నరసింహన్‌ ఇరువుర్నీ ఒక్కచోట కూర్చోబెట్టి చర్చించేందుకు అవకాశం ఎక్కువగా వుంటుంది.  నరసింహన్‌ కాకుండా ఇంకెవరు గవర్నర్‌ పదవిలో కూర్చున్నా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యల్ని అధ్యయనం చేయడానికే కాస్తంత సమయం పడ్తుంది. నరసింహన్‌ అలా కాదు, ఆయన విభజనకు ముందు నుంచే గవర్నర్‌గా పనిచేస్తున్న దరిమిలా, ఆయనకు అన్ని విషయాలపైనా అవగాహన వుంది. సో, ఇప్పట్లో గవర్నర్‌ మార్పు వుండకపోవచ్చన్నది ఓ వాదన. అదే సమయంలో, ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంలోనూ, ఓటుకు నోటు కేసు విషయంలోనూ, సెక్షన్‌ 8 అమలు పర్చడంలోనూ, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలోనూ నరసింహన్‌ సరిగ్గా స్పందించడంలేదు కాబట్టి, నరసింహన్‌ మార్పు తథ్యం అన్నది ఇంకో వాదన.  ఎవరి వాదనలు ఎలా వున్నా, కేంద్రం తలచుకుంటే గవర్నర్‌గా నరసింహన్‌ స్థానంలో ఇంకొకర్ని తీసుకురావడం పెద్ద విషయమేమీ కాదు. ఢిల్లీ పెద్దల మదిలో ఏముందో, తెలుగు రాష్ట్రాల పట్ల ఏ కోణంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారో ఎవరికెరుక
« PREV
NEXT »

No comments

Post a Comment