తాజా వార్తలు

Saturday, 26 September 2015

హైదరాబాద్ వచ్చే బస్సుల రూట్లు

జిల్లాల నుంచి  హైదరాబాద్  కు వచ్చే బస్సుల రూట్లలో నిమజ్జనం సందర్భంగా స్వల్పమార్పులు.
* కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి వచ్చే బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్, పికెట్ వరకు మాత్రమే నడుస్తాయి. 
* మహబూబ్‌నగర్, కర్నూల్ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ క్రాస్ రోడ్ నుంచి నడుస్తాయి. 
* సూర్యాపేట, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లే బస్సులు ఎల్‌బీనగర్ రూట్ నుంచి నడుస్తాయి.
* జహీరాబాద్, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే బస్సులు గోద్రేజ్ వై జంక్షన్, బాలానగర్, బోయినపల్లి మీదుగా జూబ్లీ బస్‌స్టేషన్, పికెట్ వరకు మాత్రమే నడుస్తాయి. 
* వరంగల్, యాదగిరిగుట్ట వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి మాత్రమే నడుస్తాయి. 
* శ్రీశైలం, కల్వకుర్తి, అచ్చంపేట వైపు వెళ్లే బస్సులు మిథాని బస్‌స్టేషన్ నుంచి మాత్రమే నడుస్తాయి.
* బీహెచ్‌ఈఎల్, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల నుంచి వివిధ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు గోద్రేజ్ వై జంక్షన్, బాలానగర్, బోయినపల్లి, జూబ్లీ బస్‌స్టేషన్, మెట్టుగూడ, తార్నాక, నాగోల్, ఎల్‌బీనగర్ మీదుగా వెళ్తాయి.
* వికారాబాద్, తాండూరు, పరిగి వైపు వెళ్లే బస్సులు మెహిదీపట్నం నుంచి మాత్రమే నడుస్తాయి.
సిటీ సర్వీసుల వివరాలు 
ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజీబీఎస్ నుంచి కింది రూట్లలో ప్రతి 15 నిమిషాలకు ఒక సిటీ బస్సు నడుస్తుంది. 
* జేబీఎస్‌కు ప్లాట్‌ఫాం నెం.55, 56 నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. 
* ఉప్పల్‌కు ప్లాట్‌ఫాం నెం. 43,44,45 నుంచి బస్సులు నడుస్తాయి.
* ఎల్‌బీనగర్‌కు ప్లాట్ ఫాం నెం. 11,12 నుంచి సర్వీసులు నడవనున్నాయి. 

* ఆరాంఘర్‌కు ప్లాట్ ఫాం నెం 28,29,30 నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
అలాగే, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, ఉప్పల్‌కు సరిపడా సిటీ బస్సులను నడుస్తాయి. 
* ప్రైవేట్ బస్సులు శివారు ప్రాంతాల నుంచే నడుపుకోవాలి.
* ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు, అక్కడి నుంచి నగరంలోకి వచ్చే వారు నెక్లెస్‌రోడ్డు, ఎన్టీర్ మార్గ్, ట్యాంక్‌బండ్ రోడ్ల వైపు రావద్దు.
« PREV
NEXT »

No comments

Post a Comment