తాజా వార్తలు

Sunday, 6 September 2015

త్వరలో స్వచ్ఛ్ విశాఖ- సీఎం చంద్రబాబు

విశాఖపట్టణాన్ని క్లీన్..గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖ పర్యాటక, పారిశ్రామిక రంగంతో పాటు వివిధ రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఇక్కడున్న ఆర్టీసీ కాంప్లెక్సును ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ దీనిని కమర్షియల్ గా ఉపయోగించుకొనే అవకాశాలను చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఫిషరీస్ మార్కెట్ ను ఒక పద్ధతి ప్రకారం మోడ్రన్ గా తయారు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఓల్డ్ సిటీ చాలా భయంకరంగా ఉందని, డ్రైన్ వాటర్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పాతకాలంగా ఉన్న డ్రైన్స్ ను తొలగించడంపై చర్యలు తీసుకుంటామని, నివాసాల్లో ఉన్న వారు చెత్తను డ్రైన్ లో వేయవద్దని సూచించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment