తాజా వార్తలు

Wednesday, 9 September 2015

ఐటీ వినియోగంలో చంద్రబాబునాయుడుకి షాక్ ఇచ్చిన కేసీఆర్‌'ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుతం చైనా టూర్‌లో ఉన్నారు.' ఆయన సెక్రటేరియేట్‌లో ఉన్నా, ఫాంహౌస్‌లో ఉన్నా రాష్ట్రంలో కొంత మంది ప్రజలకు ఆ సంగతి రోజు గడచినా తెలియకపోవచ్చునేమో గానీ.. కేసీఆర్‌ చైనా పర్యటనలో ఉన్నారు అనే సంగతి పూసగుచ్చినట్లు తెలిసిపోతోంది. చైనా లో కేసీఆర్‌ కు సంబంధించిన ప్రతి కదలికలు ఎప్పటికప్పుడు నగరంలోని మీడియా ప్రతినిధులకు అందిపోతున్నాయి. ఫోటోలు, వీడియోలు, ఆయన భేటీలకు సంబంధించిన ప్రతి చిన్న అంశం వీడియోలు కూడా ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు హైదరాబాదుకు చేరుతున్నాయి. చూడబోతే.. చైనా పర్యటనలో ఇలాంటి పీఆర్‌ వ్యవహారాలు చూడడానికి కేసీఆర్‌ వెంట వెళ్లిన టీం చాలా చక్కగా ప్లాన్‌డ్‌ గా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.  ఐటీ వినియోగంలో నన్ను మించిన వాళ్లు లేనే లేరని చంద్రబాబునాయుడు అంటూ ఉంటారు గానీ.. ప్రస్తుతం చైనా పర్యటనకు సంబంధించి.. జరుగుతున్న సమావేశాల గురించి ఫోటోలు విజువల్స్‌ హైదరాబాదులోని స్థానిక మీడియాకు ఎప్పటికప్పుడు అందుతున్న తీరును గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. నిజానికి చంద్రబాబు విదేశీ టూర్‌ల సమయంలో కూడా ఇంత షార్ప్‌గా ఎప్పటికప్పుడు ఫీడ్‌ అందలేదు. కానీ ఈ దఫా కేసీఆర్‌ టూర్‌ భిన్నంగా సాగుతోంది.  ఇంటీరియర్‌లో.. జరుగుతున్న సమావేశాలు కూడా ఎలాంటి వెరపు లేకుండా.. వీలైనంత వరకు మంచి రిజల్యూషన్‌తో వీడియోలు తీసి పంపుతున్నారు. సెలఫోన్‌తో తీసినట్లు బ్లర్‌డ్‌గా కాకుండా ఓ మోస్తరుగానే ఉంటున్నాయి. పైగా ఏదో మొక్కుబడిగా 30 సెకన్లు, నిమిషం విజువల్స్‌ కాదు... చూడడానికి కాస్త వివరం తెలిసే లాగానే వీడియోల నిడివి కూడా ఉంటోంది.  మొత్తానికి రాష్ట్రంలో ఉన్న దానికంటె చైనాలో ఉన్న సమయంలో కూడా.. కేసీఆర్‌ మీడియాలో ఎక్కువ పబ్లిసిటీ పొందగలుగుతున్నారు. ఆయన టూర్‌ విశేషాలు లేకుండా బులెటిన్లు రావడం లేదంటే.. ఆయన టీం పనితీరుకు ఇంతకంటె పెద్ద నిదర్శనం ఏం కావాలి? 
« PREV
NEXT »

No comments

Post a Comment